ప్రియాంకా గాంధీ సభపై టీవీ 9 అక్కసు.. ఎందుకు?

కాంగ్రెస్ కు మైలేజ్ పెరిగే ప్రతి సమయంలోనూ దాని నీరుగార్చడంలో బీఆర్ఎస్ కు సహాయకారిగా ముందుంటుంది టీవీ9. అధికార పార్టీకి పరోక్షంగా సహాయకారిగా పని చేసే టీవీ9 ఇప్పుడు కాంగ్రెస్ యువ సంఘర్షణ సభ సక్సెస్ తో అలాంటి ప్రయత్నమే ప్రారంభించింది. 

ప్రియాంక గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ కు ప్రాధాన్యత పెరుగుతుందని అంచనా వేసిన టీవీ9, వ్యూహాత్మకంగా సభ ప్లాప్ అయిందనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. కొన్ని అంశాలను ప్రస్తావించి సభ అనుకున్న రీతిలో సక్సెస్ కాలేకపోయిందని కథనం ప్రసారం చేసింది. వాస్తవానికి సభ పూర్తిగా విజయవంతమైంది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పూర్తిగా నిండిపోయింది. కొద్దిమంది కాంగ్రెస్ నేతలు డుమ్మా కొట్టారు. నాయకులు గైర్హాజరు కావడాన్ని చూపించి సభ మొత్తమే ప్లాప్ అయిందని టీవీ9 కథనం ప్రచారం చేయడం వారి భావదారిద్ర్యాన్ని బయటపెట్టింది.

నాయకులు వచ్చారా..? లేదా..? అనే చర్చ అవసరం లేదు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతమేరకు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయనేది ఇప్పుడు చర్చ. యూత్ డిక్లరేషన్ ను కాంగ్రెస్ నేతలంతా బలంగా యువతలోకి తీసుకెళ్తే కాంగ్రెస్ కు యువత ఓట్లు గంపగుత్తగా పడుతాయని రాజకీయ పరిశీలకులు చెబుతుంటే.. టీవీ9 మాత్రం ఆ అంశాన్ని పక్కనపెట్టేసి కాంగ్రెస్ పై అక్కసు వెళ్ళగక్కింగి. టీవీ9 ప్రసారం చేసిన కథనంలో యూత్ డిక్లరేషన్ హామీలకు అసలు స్థానం కల్పించకుండానే యువ సంఘర్షణ సభ వచ్చే ఎన్నికల్లో ఏమాత్రం ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని సత్యదూరమైనా కథనాలు ప్రసారం చేసింది. మొత్తానికి టీవీ9కథనం చూసిన చాలామంది టీవీ9 బీఆర్ఎస్ కు ఊడిగం చేస్తూ జర్నలిజం విలువలకు పాతరేస్తుందని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు.

 

(polytricks.in సౌజన్యంతో.. )

Post a Comment

1 Comments