ఈ లింక్ ఏమిటమ్మా.. తప్పమ్మా కవిత.. !

దైనా ప్రమాదమో, అపాయమో ముంచుకొస్తుందంటే చాలు..  తెలంగాణ సెంటిమెంట్ ను ముందుపెట్టి తప్పించుకుంటారనే ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఎప్పుడూ వినిపిస్తుంటాయి. తాము చేసే తప్పుల నుంచి కాపాడుకునేందుకు దాన్ని ఓ రక్షణకవచంగా వాడుకుంటుంటారని చాలా మంది అభిప్రాయపడుతుంటారు. గతంలో ఈ సెంటిమెంట్ బాగానే వర్కవుట్ కూడా అయినట్టే కనిపించింది కానీ.. ఇప్పుడు తిరగబడటం మొదలైపోయిన పరిస్థితులు వచ్చాయి.

తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. గురువారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే, విచారణకు రమ్మంటే.. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంతో యావత్తు తెలంగాణకు లింక్ పెట్టేశారు. తప్పు చేశారో, లేదో తెలియదు కానీ.. సెంటిమెంట్ అనే రక్షణ కవచాన్ని బయటకు తీశారు. అయితే ఈసారి ఎందుకో అది రివర్స్ తన్నినట్టుగా కనిపించింది. 

లిక్కర్ స్కాంలో పాత్రపై విచారణ చేపట్టేందుకు కవితకు ఈడీ నోటీసులు జారీ చేస్తే.. మొత్తం తెలంగాణనే విచారణకు పిలిచినట్లు కవిత వ్యవహరించడమేంటని  సోషల్ మీడియాలో ఒకటే చర్చ.  కవిత తప్పు చేసి,  తెలంగాణ ప్రజలకు స్కాం మరకలు అంటగట్టడమేంటని నెటిజన్లు కడిగిపారేశారు. తెలంగాణ తలవంచదు అంటూ ఆమె ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెడితే.. మొత్తం ఆమెకు వ్యతిరేకంగా కామెంట్లే వచ్చాయి.. తెలంగాణకు, ఈడీ నోటీసులకు సంబంధం ఏమిటి అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించడమే కనిపించింది. ఏదేమైనా కవిత తాను తప్పించుకోవడానికి ఒక  ప్రాంతానికి, రాష్ట్రానికి లింక్ పెట్టడం ఆమె పేరును మరింత డామేజీనే చేసిందని చెప్పాలి. 

కవిత చేసిన ట్వీట్.. దానికి వచ్చిన కామెంట్లను ఈ లింక్ లో చూడొచ్చు..

Post a Comment

0 Comments