సందర్భం : ఇది జర్నలిజమా .. బ్రోకరిజమా..??


తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజం విలువలు మరీ దిగజారిపోతున్నాయి.  దురదృష్టవశాత్తూ అడ్డగోలుగా మాట్లాడేవారందరూ జర్నలిస్టులుగా చెలమాణి అయిపోతున్నారు. ఇంట్లో ఒక పెద్ద స్మార్ట్ టీవీ, యూట్యూబ్ లో ఒక అకౌంట్, తిట్టడానికి నోటికి కొన్ని బూతులు వస్తే చాలు.. ఇక సమాజాన్ని ఉద్దరించేయొచ్చన్నట్టుగా ఫీలైపోతున్నారు. పొద్దున్నే లేచి, తమకే సంబంధమూ లేని నాలుగు పేపర్లలోని హెడ్ లైన్లను చదివేసి, తమ బుర్రకు తోచిన విశ్లేషణేదో చేసేసి అపర మేధావుల్లా బిల్డప్పులు ఇస్తున్నారు.

గంటసేపు లైవ్ లో తమ పైత్యం చూపించి, ఆరోజుకి ప్రజలందరి, అన్ని బాధలని తీర్చేసినట్టు ఫోజులు కొడుతుంటారు. పోనీ అంత డ్రామా నడిపి నిజాయతీగా, నిస్పక్షపాతంగా వీడియోలు చేస్తారా అంటే అదీ ఉండదు. వారి పేరుకు ముందు మాత్రమే జర్నలిస్టు అనే ట్యాగు కనిపిస్తుంది.. వెనకంతా తమకు నచ్చిన, ప్యాకేజీ ఇచ్చిన పార్టీని మోయడమే. మరీ విచిత్రం ఏమిటంటే.. ఈ ఎర్నలిస్టులు సారీ.. జర్నలిస్టులు.. ఆయా పార్టీల కార్యకర్తల కంటే ఎక్కువ డ్యూటీ తామే చేస్తుంటారు. కంటికి కనిపించకుండా వారి జెండాను, అజెండాను శక్తివంచన లేకుండా భుజానా మోస్తుంటారు.

తీన్మార్ మల్లన్న, జర్నలిస్టు రఘు, జర్నలిస్టు శంకర్, జర్నలిస్టు రంజిత్, జర్నలిస్టు దినేష్, జర్నలిస్టు ఏఎస్సార్.. ఇలా చెప్పుకుంటూపోతే జర్నలిజం ట్యాగ్ ఉన్నవాళ్లు మార్కెట్ లో చాలా మందే కనిపిస్తుంటారు. వీళ్లలో కొందరు మొదటి నుంచి ప్రత్యేకంగా కొన్ని పార్టీలకే కట్టుబానిసలుగా పనిచేస్తోంటే.. మరికొందరేమో పరిస్థితులు, పార్టీలు, నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఏ ఎండకు ఆ గొడుకు పట్టేరకం. వీళ్లు ఎప్పుడు ఏ పార్టీకి జై కొడతారో, ఏ లీడర్ కు అనుకూలంగా మాట్లాడతారో వ్యూయర్స్ కు కూడా అంతుబట్టదు. అలా అని వీరిలో అందరు ఒకేలా లేరు..  కొంత మంది మాత్రం న్యూట్రల్ గా వార్తలు, విశ్లేషణలు చేస్తుంటారు. దురదృష్జవశాత్తూ వారి ఛానెళ్లకి వ్యూస్ ఉండవు.

జర్నలిజం పేరుతో బ్రోకరిజం చేస్తున్న కొందరు ఎర్నలిస్టుల చర్యలు కూడా ఊహాతీతంగా ఉంటాయి.  వార్తను వార్తలా విశ్లేషించకుండా.. ఎవరో లీడర్ ని లుచ్చాలు, లంగాలు, లంఫగాలు అని  బండబూతులు తిట్టి, అడ్డమైన మాటలతో రెచ్చగొడతారు.  ఆ తర్వాత ఆ లీడర్ అభిమానులకో, కార్యకర్తలకో గుండె మండి ప్రతిగా భౌతిక దాడి చేస్తారు.. ఇక దాన్ని పట్టుకున ఈ ఎర్నలిస్టులు కమ్ జర్నలిస్టులు చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమపై జరిగిన దాడిని మొత్తం మీడియా స్వేచ్ఛపైనే దాడి జరిగినట్టు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టు గోల గోల చేస్తుంటారు. ఇక సదరు జర్నలిస్టు ఊడిగం చేసే పార్టీ అయితే ఒంటికాలిపైనే లేస్తుంది.. ప్రశ్నించే గొంతుని నొక్కుతారా.. అంటూ బయల్దేరుతుంది.. తమ బలిపశువుకు అనుకూలంగా నాలుగు రోజులు ప్రెస్ మీట్లు, ఖండనలు చేసి, వారిని మరింత రెచ్చిపోవాలని నూరిపోస్తుంది.. ఆపై మళ్లీ నోరుపారేసుకోవడం.. కేసులు, దాడులు.. ఖండనలు షరామూమూలే..!

Post a Comment

2 Comments

  1. Avunu andharu donga kodukule

    ReplyDelete
  2. Vallu journalist la.. chi.. chi..

    ReplyDelete