మోజో టీవి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సంజయ్ ఆత్మహత్య!



మోజో టీవి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పని చేసి ఎందరో జర్నలిస్టులను తయారుచేసిన సంచలన జర్నలిస్ట్ సంజయ్ కుమార్ సింగ్ తన ఛాంబర్ లో ఉరి వేసుకుని చనిపోయారు! ఇండియా టీవి లో  అనేక సంచలనాత్మక స్టోరీలు అందించిన మహా జర్నలిస్ట్ పిరికివాడుగా తిరిగి రాని లోకాలకు బలవంతంగా వెళ్ళిపోయాడు! విచారకరం!

"ఇది నా కల
పరుగెత్తడానికి సాయ శక్తులా ప్రయత్నించాను
ఇప్పుడు పరుగెత్తే శక్తి లేకుండా పోయింది
నాలో ధైర్యం పూర్తిగా చచ్చిపోయింది
ఇక ఉంటాను "
.... ఇది సంజయ్ టేబుల్ పై దొరికిన చివరి ఉత్తరం!

సంజయ్ ఒక విలక్షణ జర్నలిస్ట్! బీహారీ అతను! ఇండియా టీవి లో ఢిల్లీ లో గొప్ప జర్నలిస్ట్ గా గుర్తింపు పొందాడు! ఉన్నత విలువలు కలిగిన పాత్రికేయుడు! అతడ్ని గమనించిన లెజండ్రి జర్నలిస్ట్ రవి ప్రకాష్ హైదరాబాద్ ఆహ్వానించాడు! మోజో టీవి పగ్గాలు ఇచ్చాడు! మోజో మూత పడింది! అతను తిరిగి వెళ్లలేకపోయాడు! హైదరాబాద్ లోనే ఉండి పోయాడు! ఇంతలో భార్య కు బ్రెస్ట్ క్యాన్సర్! ఎవరూ సాయం చేయలేదు! ఎవ్వరూ సహకరించలేదు! అప్పులు చేశాడు! ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు!

ఇద్దరు ఇన్వెస్టర్స్ ముందుకు రావడం తో ఆఫీస్ ప్రారంభించి యూ ట్యూబ్ ఛానల్ కు శ్రీకారం చుట్టాడు! వచ్చిన పెట్టుబడులతో ఛానెల్ పనుల కన్నా అప్పులు తీర్చుకోవడం దృష్టి సారించిన విషయం తెలుసుకుని ఇన్వెస్టర్స్ చేతులు ఎత్తేశారు! ఇక ముందుకు అడుగు పడలేదు! పిరికి ఆలోచనలకు దారి తీశాడు!

సంజయ్ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలతో మంచి కథనాలు అందించడం లో నేర్పరి! కుటుంబ బాధ్యతలు అంటే భయం! ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయట పడటం లో విఫలమయ్యాడు! మంచి జర్నలిస్ట్ జీవితం ఇంత విషాదం గా ముగిసిపోవడం బాధాకరం! విచారకరం! సంజయ్ ఆత్మకు శాంతి! కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి! పాత్రికేయ రంగం లో ఇదే చివరి బలవన్మరణం కావాలని, మున్ముందు ఇంకెవరు ఇలాంటి పిరికి చర్యలకు పాల్పడకూడదని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను.

Copy from : Mohammed Rafee  Facebook wall

Post a Comment

1 Comments