సునీల్ కనుగోలు సుడి తిరిగినట్టేనా?

 Sunil Kanugolu Congress election strategist at Karnataka kgn

ర్ణాటక కాంగ్రెస్ విజయంలో ఎవరు కీలక పాత్ర పోషించారు అంటే.. అందరూ డీకే శివకుమార్, సిద్దరామయ్య పేర్లు చెబుతారు. అది తెరపైన. తెర వెనుక కాంగ్రెస్ వాళ్లు చెప్పే పేరు మాత్రం సునీల్ కనుగోలు. కాంగ్రెస్ స్ట్రాటజిస్ట్ అయిన సునీల్ కనుగోలు మొత్తం కాంగ్రెస్ విజయానికి వ్యూహాలు సిద్ధం చేశారని చెబుతూంటారు. కర్ణాటకలో 40 పర్సంట్ సర్కార్ అనేది వైరల్ అయింది. అలాగే పేసీఎం, పేసీఎం – క్రైపీఎం వంటి స్లోగన్లు వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ స్కీములు ప్రజల్లోకి వెళ్లేలా సునీల్ కనుగోలు టీమ్ పని చేసింది.

ఎప్పటికప్పుడు పార్టీ నేతల మధ్య సమన్వయం సాధించడంలోనూ సునీల్ కనుగోలు సక్సెస్ అయ్యారని అంటున్నారు. సునీల్ కనుగోలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు పని చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కోర్ కమిటీలో సభ్యుడు కూడా. ప్రస్తుతం తెలంగాణ కోసం కూడా పని చేస్తున్నారు. ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటోందన్న సూచనలు కనిపిస్తున్నాయి. అదంతా కనుగోలు వ్యూహాల ఫలితమేనని అనే వాళ్లు కూడా ఉన్నారు.

సునీల్ కనుగోలు ఎలా ఉంటారో కాంగ్రెస్ నేతలకు తెలుసు. ఆయన ఫోటో కూడా బయటకు రాదు. సోషల్ మీడియాలో అకౌంట్లు కూడా లేవు. ఆయన సోదరుడు చెన్నై కేంద్రంగా ఓ ఫిపోలా అనే నాన్ వెజ్ స్టార్టప్ పెట్టారు. ఆయన మీడియాలో కనిపిస్తూంటారు. ఆ ఫోటోల్నే ఎక్కువగా వాడుకుంటూ ఉంటుంది మీడియా. అత్యంత లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేసే సునీల్.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు.

హైదరాబాద్ ఆఫీసుపై పోలీసులు దాడి చేసి.. మొత్తం కంప్యూటర్లు దాడి చేసి తీసుకెళ్లారు. కర్ణాటక స్ట్రాటజీ మొత్తాన్ని దొంగతనం చేశారని. .. బీఆర్ఎస్..బీజేపీకి ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయినా సునీల్ తగ్గలేదు. స్ట్రాటజీలు మార్చుకుని కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఇక పీకే వెనక్కి వెళ్లిపోతారు.. సునీల్ కనుగోలనే సూపర్ స్టార్ స్ట్రాటజిస్ట్ అవుతారు.

Post a Comment

0 Comments